యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ పద్ధతిలో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగాణంలో ఉన్న వేదాశీర్వచన మండపంలో ఎమ్మెల్యేకు పండితులు ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రోటోకాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు