మహబూబాబాద్ జిల్లా జనవరి 24
బుధవారం రోజు మానుకోట జిల్లా కేంద్రంలోని సేవాలాల్ సేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సేవాలాల్ సేన మహిళా విభాగం కమిటీలో భాగంగా బుధవారం రోజు మానుకోట సేవాలాల్ మహిళా సేన జిల్లా అధ్యక్షురాలిగా పర్వతగిరి గ్రామ సోమ్లా తండా పంచాయతీకి చెందిన భూక్యా స్రవంతిమోహన్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధరావత్ మోతిలాల్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్ వెంకన్న నాయక్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం భూక్యా స్రవంతిమోహన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించిన జిల్లా కమిటీకి రాష్ట్ర జాతీయ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. నా వెన్నంటే ఉండి నడిపించే అన్నయ్యలు జాతీయ కోరుకునే సభ్యులు మోతిలాల్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్ వెంకన్న, జిల్లా అధ్యక్షులు నందులాల్ నాయక్ లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జాతి మనుగడ కోసం జాతి, శ్రేయసుకోసం మహిళా విభాగాన్ని బలోపేతం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగులోతు నందులాల్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి బాదావత్ రాంబాబు నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధికార ప్రతినిధి సురేష్ నాయక్, మానుకోట పట్టణ అధ్యక్షులు బోడ దిలీప్ నాయక్, కేసముద్రం మండల సేవాలాల్ సేన అధ్యక్షులు నరేందర్ నాయక్, చిన్నగూడూరు మండల సేవాలాల్ సేన నాయకులు బాదావత్ సురేష్ నాయక్, మహబూబాబాద్ మున్సిపాలిటీ ఆరో వార్డు అధ్యక్షులు బోడ సుమన్ నాయక్, జిల్లా నాయకులు, మండల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.