
MCPI(U) demands
భూభారతిని తక్షణమే అమల్లోకి తీసుకురావాలి
పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వాలి ..ఎం సి పి ఐ ( యు) డిమాండ్
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎం సిపిఐ (యు ) నాయకులు నర్సంపేట ఆర్డీవో ద్వారా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూ భారతి అమలు చేయకపోవడం మూలంగా రైతుల భూముల సమస్యలు తీవ్రతరం అయ్యాయని అన్నారు.గత 15 ఏళ్లుగా నర్సంపేట పట్టణంలో 111 లో సర్వే నెంబర్ లో పేదలు వేసుకున్న గుడిసెలకు ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కాలనీ వాసుల కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని అన్నారు.అంతర్గత రోడ్లు , డ్రైనేజీ,మంచినీటి సౌకర్యం వెంటనే కల్పించాలని కోరారు.సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న క్రమంలో కాలనీలో హెల్త్ క్యాంపులను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న,మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వంగల రాగసుధ,రైతు సంఘం రాష్ట్ర నాయకులు నాగేల్లి కొమురయ్య , ఎంసీపీఐ (యు)డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ,ఏఐసిటియు జిల్లా అధ్యక్షులు ఎండి మా షూక్ పాల్గొన్నారు.