
Bhu Bharati
భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు
తహసీల్దార్ శ్రీనివాసులు
భూపాలపల్లి నేటిధాత్రి:
మున్సిపాలిటీ పరిధిలో జంగేడు కాసింపల్లి లో భూ భారతి అవగాహన సదస్సు నిర్వహించిన భూపాలపల్లి తహసీల్దార్ వి శ్రీనివాసులు డిప్యూటీ తాసిల్దార్ అంజలి రెడ్డి అనంతరం భూ భారతి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా తాసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలో ఉన్న
భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాసు బు క్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బి లో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తా మని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తైన క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అంజలీ రెడ్డి, రెవెన్యూ ఆర్ ఐ రామస్వామి సర్వేర్ శ్రీనివాస్ రావు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.