
Bhoomi Puja
కల్వకుర్తి మున్సిపాలిటీ పట్టణంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
శనివారం కలకుర్తి మున్సిపాలిటీలోని 7వ వార్డులో హనుమాన్ నగర్, గాజులవాడ, అంబేద్కర్ నగర్, కాలనీలలో కల్వకుర్తి నియోజకవర్గo ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఈరోజు ఉదయం బృంగి ఆనంద్ కుమార్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమo నిర్వహించారు7వ వార్డులో 17మంది నిరుపేద కుటుంబాలకు ఇండ్లు మంజూరు కావడం జరిగింది. అందులో పది మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ చేసి ముగ్గు పోశారు.ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ శ్రీలత గారు, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు జ్యోతి, మాజీ కౌన్సిలర్ గోరటి శ్రీనివాసులు మాజీ కౌన్సిలర్స్ లక్ష్మీ చిన్నరామిరెడ్డి, నేరటి చిన్న, బాలునాయక్, బృంగి ప్రవీణ్, వర్కాల భాస్కర్ రెడ్డి, మబ్బు సాయిలు, చంద్రకాంత్ రెడ్డి, జమ్ముల శ్రీకాంత్, రావుల శ్రీనివాసులు, రేష్మా బేగం, ఝాన్సీ, జ్యోతి, గంగావతి, రాహుల్, వర్షపాకల శేఖర్, సైదులు యాదవ్, ఆంజనేయులు, కార్తీక్, తరుణ్, పరుశురాములు, షమీం, రియాజ్ ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.