Sri Vivek Venkataswamy
పొన్నారం గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ
మందమర్రి నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని పొన్నారం గ్రామంలో, పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ వివేక్ వెంకటస్వామి గారు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రజలకు వసతి హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మొదటి దశగా పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మాణం ప్రారంభమవుతుందని వారు తెలిపారు.

నిరుపేద కుటుంబాలకు విశ్వసనీయంగా, నాణ్యమైన నివాస వసతులు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే, ఎంపీలు పేర్కొన్నారు.
