
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి నూతన అధికారిగా భీమ జయశీల బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వహించిన నల్ల రాజేందర్ రెడ్డి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలానికి బదిలీ కాగా రాజేందర్ రెడ్డి స్థానంలో భీమ జయశీల చార్జి తీసుకోగా స్థానిక ఏ. పి. ఓ. గంగా తిలక్, ఎం. పి. ఓ. సబిత తో పాటు సిబ్బంది ఘన స్వాగతం పలికి పూల బొకే అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల అభివృద్ధి కోసం తన వంతు బాధ్యతగా పనిచేస్తానని పేర్కొన్నారు. అలాగే మండలానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ. పి. ఎం. గిన్నె రవీందర్, సూపర్డెంట్ ఎండి అరిఫ్ హుస్సేన్, సీనియర్ సహాయకులు గడ్డం శ్రీనివాస్, జూనియర్ సహాయకులు జి వంశీకృష్ణారెడ్డి, మరియు మండల ప్రజా పరిషత్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.