
వనపర్తి నేటిదాత్రి ;
పట్టణంలో కొత్తకోట రోడ్డులో శ్రీ వెంకటేశ్వర భారత్ గ్యాస్ ఏజెన్సీ లో ఆధార్ కేవైసీ నిలిచిపోవడం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ప్రజలకు హామీ ఇచ్చింది .ఈ సందర్భంగా వినియోగదారులు గ్యాస్ ఆధార్ కేవైసీ చేయించుకోవడానికి గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళితే సాఫ్ట్వేర్ పనిచేయడం లేదు ప్రజల ను వాపస్ పంపుతున్నారు . నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ మాపై కలెక్టర్ గారికి మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులకు భారత్ గ్యాస్ కంపెనీలకు ఫిర్యాదు చేసుకోమని చెప్పారు . అని వినియోగదారులు పేర్కొన్నారు గతంలో వనపర్తి లో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై ప్రజల తొ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నార ని వినియోగదారులపై ఆదనపు డబ్బులు చార్జీలు లేకుండా గ్యాస్ సరఫరా డోర్ డెలివరీ చేయాలని కేంద్ర ప్రభుత్వ నిబంధన ఉన్న నిబంధనలను గాలికి వదిలేసి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై విచారణ చేసి వినియోగదారుల నుండి వసూలు ప్రజలను ఇబ్బందులకు గురి గ్యాస్ నిర్వాహకులపై అఖిలపక్షం దృష్టి కేంద్రీకరించి కట్టడి చేయాలని వినియోగదారులు కోరుతున్నారు . ఈ విషయంపై తహసిల్దార్ యాదగిరి ని వివరణ కోరగా డీఎస్ఓ జయం ట్ కలెక్టర్ గారికి తెలపాలని నాకు తెలియదని అన్నారు