
Bharatiya Mazdoor Sangh
70 సంవత్సరాలు పూర్తిచేసుకున్న భారతీయ మజ్దూర్ సంఘ
ముఖ్యఅతిథిగా హాజరై హాజరై జెండా ఆవిష్కరణ చేసిన అడగాని జనార్దన్ రావు
పరకాల నేటిధాత్రి
భారతీయ మజ్దూర్ సంఘ 71వ సంవత్సరంలోకి ప్రవేశస్తున్న సందర్భంగా పట్టణంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడగాని జనార్దన్ రావు హాజరై జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా బిఎంఎస్ నిలిచిందని,కార్మికుల కోసం నిరంతరం పనిచేస్తుందని అన్నారు.1955లో భూపాల్ పట్టణంలో మధ్యప్రదేశ్లో స్థాపించిన కార్మిక సంఘం క్రమక్రమంగా భారతదేశంలో నెంబర్ వన్ యూనియన్ గా పేరు తెచ్చుకున్నదన్నారు.కార్మికుల కోసం ఎన్నో త్యాగాలు చేసి హక్కులను కాపాడినది ఇంకా మిగిలిన వాటిని సాధించడానికి ముందంజలో ఉన్నదని కార్మికుడు నాయకుడిగా ఉండాలని ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా కార్మికుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తున్నదని బిఎంఎస్ అసంఘటిత సంఘటిత అన్ని కార్మిక రంగాలలో పనిచేస్తున్నదని అదేవిధంగా ప్రపంచ దేశాలలో కూడా ఆచరణలో తీసుకున్నారు.

కార్మికులకు పనికి తగిన వేతనం అసంఘటిత కార్మికులకు ఆరోగ్య భద్రత వారానికి ఒకరోజు సెలవు దినం లేబర్ యాక్ట్ ప్రకారం జీతాలు వారి పిల్లలకు ఉచిత చదువులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నమన్నారు.కార్మికులను మర్చిపోతున్న ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కుదింపు చేస్తూ కార్మికులకు అన్యాయం జరుగుతున్నదని ఇదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కూల్చడం కార్మికులకు కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో దర్జీ కార్మికులు ఎంఏ.షరీఫ్,మేఘనాథ్,సాంబయ్య,దొంతుల జగన్,రమేష్,తిరుపతి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.