
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతి మండల కేంద్రానికి భారత్ గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేసింది అందులో భాగంగా చిట్యాల ఉమ్మడి మండలంగా ఉన్నందున చిట్యాల మొగుళ్ళపల్లి కి గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేసింది మండలాలు విడిపోవడం వలన టేకుమట్ల మండలం ఏర్పాటు చేయడం జరిగింది మండలం ఏర్పడి గత ఏడు సంవత్సరాలు అవుతున్న ఇప్పుడు వరకు మండల కేంద్రానికి భారత్ గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేయలేదు మండల కేంద్రానికి తక్షణమే భారత్ గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్యాస్ వినియోగదారులు టేకుమట్ల మండలంలో గ్యాస్ ఏజెన్సీ ఉంటే వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గ్యాస్ సరఫరా జరుగుతుందని అన్నారు… జిల్లా కలెక్టర్ నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించి తక్షణమే టేకుమట్ల మండల కేంద్రానికి భారత్ గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కోరుతున్నాం