కలుషితమవుతున్న భగీరథ నీరు
పలుచోట్ల వృధాగా పోతున్న
పట్టించుకోని అధికారులు
వేములవాడ రూరల్ :నేటిధాత్రి
వేములవాడ రూరల్ మండలం పలు గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా గ్రామ పంచాయతీలకు కలుషిత నీరు సరఫరా అవుతుంది కొన్ని నెలల నుంచి మిషన్ భగీరథ నీరు రంగు మారిన నీరు సరఫరా అవుతున్న ఎవరు పట్టించుకుంటలేరు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక అధికారులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది క్లోరినేషన్ చేసిన శుద్ధ నీటిని అందిస్తున్నామని అధికారులు చెబుతున్న అది ఆచరణలో సాధ్యం కావడం లేదు పంచాయతీ అధికారులు మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారుల మధ్య సమన్వయం కోరవడంతో సమస్య పరిష్కారం కావడం లేదని కిందిస్థాయి సిబ్బంది వాపోతున్నారు ఎండాకాలం సమీపిస్తుండడంతో మంచినీరు అందక కుళాయిలో మురికి నీరు వస్తుండడంతో తాగడానికి ప్రజలు వాడకుండా వృధాగా వదిలేస్తున్నారు రంగు మారిన మిషన్ భగీరథ నీటి వల్ల ప్రజలకు పలు ఇబ్బందులు తలెత్తుతూ రోగాలు బారిన పడుతున్నారు ఇది కాక అనేక చర్మవ్యాధుల పట్ల పలు అవస్థలు పడుతున్నారు
మిషన్ భగీరథ నీరు ట్యాంక్ నుండి వృధాగా పోతున్న పట్టించుకోని అధికారులు
చెక్కపల్లి గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు నిండి వృధాగా పోతున్న పట్టించుకోని అధికారులు ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో నీరు ఇలా వృధాగా పోతున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు ఇప్పటికైనా అధికారులు కలుషిత నీరు సరఫరా కాకుండా చూడాలని ట్యాంకులు నుండి వృధాగా పోతున్న నీటిని అరికట్టి ప్రజలకు సకాలంలో మంచినీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు