
# డివిజన్ వ్యాప్తంగా నిరసన సెగలు.
నర్సంపేట,నేటిధాత్రి :
సచివాలయం ముందు తెలంగాణతల్లి విగ్రహం ఉండాల్సిన స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణ పట్ల భారత్ రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు భగ్గుమన్నారు.నర్సంపేట డివిజన్ పరిధిలోని దుగ్గొండి,నర్సంపేట,చెన్నారావుపేట, నెక్కొండ,ఖానాపురం,నల్లబెల్లి మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.నర్సంపేట పట్టణంలో,పలు మండల కేంద్రాలలో తెలంగాణతల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేశారు.అమరవీరుల స్థూపాల వద్ద నివాళులు అర్పించారు.
రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో నిరసన కార్యక్రమాలు పాల్గొన్న నర్సంపేట పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,నల్లబెల్లి మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి మాట్లాడుతూ తెలంగాణ తల్లి ఆత్మగౌరవని కించపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు.నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన,తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తెలంగాణ తల్లిని అవమానించారని అవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి మరియు రేవంత్ రెడ్డికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమాలలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు,మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పిటిసిలు ,పీఎస్ఎస్ చైర్మన్ లు, కౌన్సిలర్స్ ,నియోజకవర్గ నాయకులు ,క్లస్టర్ బాధ్యలు మరియు ఇతర నాయకులు,కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.