భద్రాచలం నేటి దాత్రి
శ్రీ నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో పిల్లలకు ఆది నుండే ధర్మ మార్గంలో నడిచేలా విద్యతోపాటుగా ఆధ్యాత్మిక చింతనను అలవాటు చేయాలనే ఉద్దేశ్యంతో భద్రాచలం మరియు బూర్గంపాడు మండలాలలో గల వివిధ పాఠశాలల్లో భగవద్గీత పుస్తకాలను అందించి ప్రతిరోజు ఒక గంట పాటు ఆ గీతను బోధించే విధంగా ఏర్పాటు చేస్తున్నది శ్రీ నృసింహ సేవా వాహిని. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ, నేడు సమాజంలో పిల్లలు చిన్న వయసులోనే వివిధ అలవాట్లకు లోనవుతున్నారని, దేశo గర్వించదగ్గ పౌరులుగా ఎదగాల్సిన చిన్నారులు ఎంతో మంది నేడు వక్రమార్గాలను ఎంచుకొని ఎన్నో అవస్థలు పడుతున్నారని,అతి కొద్దిమంది ఉన్నతులుగా ఎదిగినా చివరికి కుటుంబంలో తల్లిదండ్రులను సైతం వృద్ధాశ్రమాలలో మరియు అనాధ శరణాలయాల్లో ఉంచుతున్నారని అటువంటి వ్యవస్థ పోవాలoటే చిన్న నాటి నుండే పిల్లలకు విలువలతో కూడిన విద్యా విధానాన్ని అందజేసినట్లయితే భవిష్యత్తరాలలో పిల్లలు ఉన్నత పౌరులుగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు, అంతేకాకుండా పాఠశాల స్థాయిలో పిల్లలకు విలువల గురించి, సమాజం గురించి చిన్ననాటి నుండే పిల్లల్లో బీజాలు వేసినట్లయితే రానున్న తరాలలో ఒక గొప్ప సామ్రాజ్యమే తయారవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నృసింహ సేవా వాహిని వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి, పాఠశాలల యాజమాన్యాలు మరియు పచ్చి పులుసు సుబ్బారావు,లలిత కుమారి విశ్వహిందూ పరిషత్ సురేష్ కుమార్,శివాలయం రాఘవేంద్ర ప్రసాద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.