భద్రాచల సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలు..ఆర్టీసీ సంస్థ సేవలు
సిరిసిల్ల టౌన్ :(నేటి దాత్రి)
శ్రీరామనవమి సందర్బంగా భద్రాచలం లోని శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో ద్వారా అందచేస్తామని సిరిసిల్ల ఆర్.టీ.సీ డిపో మేనేజర్ ప్రకాష్ రావు అన్నారు .బుధవారం సిరిసిల్ల బస్ స్టేషన్ లో తలంబ్రాల బుకింగ్ రశీదు పుస్తకాలను ఆవిష్కరించినారు.ఈ సందర్బంగా డిపో మేనేజర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ కల్యాణ తలంబ్రాలు బుకింగ్ కోసం భక్తులు సిరిసిల్ల బస్టాండ్ లోని కార్గో కార్యాలయం లో మరియు డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వద్ద,ఏజెంట్ ల వద్ద 151/- లు చెల్లించి బుకింగ్ రసీదును పొందాలనిఅన్నారు . కళ్యాణ అనంతరం భక్తుల ఇండ్లకు తలంబ్రాలను అందజేస్తామని,స్వామివారి కల్యాణానికి వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీరాముడి ఆశీస్సులను పొందాలని అన్నారు. తలంబ్రాలు బుకింగ్ కోసం 9154298576
,9154298577,9492448189 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కార్గో సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.