
భద్రాచలం నేటి ధాత్రి
రెండు మోటార్ ల సైకిల్ రికవరీ.
భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు,భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించిన ఎస్సై విజయలక్ష్మి.
భద్రాచలం పట్టణంలో మోటర్ సైకిల్ ల దొంగతనాలు చేస్తున్నాడని పక్కా సమాచారంతో తనిఖీలు చేయగా భద్రాచలం పట్టణానికి చెందిన అకునురి రాజేంద్రప్రసాద్ ను భద్రాచలం పోలీస్ లు చాకచక్యంగా పట్టుకొని తనదైన శైలి లో విచారించగా, భద్రాచలం పట్టణంలోని యూబి రోడ్డు మరియు, లంబాడ కాలనీ లో నిలిపి ఉంచిన రెండు మోటార్ సైకిల్ లను దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నాడు.
దొంగతనానికి పాల్పడిన ఆకునురి రాజేంద్రప్రసాద్ s/o లేట్ శ్రీనివాస్ రావు 42 సం. ముదిరాజ్ బజార్ భద్రాచలం వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు పోలీసులు తెలిపారు..
పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకు తిరుగుతున్న దొంగను చాకచక్యంగా అరెస్టు చేసిన భద్రాచలం పోలీసులను ఏఎస్పీ పారితోష్ పంకజ్ ఐపీఎస్ అభినందించారు.
ఇట్టి కార్యక్రమంలో భద్రాచలం టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి ఎస్ఐ విజయలక్ష్మి మరియు సిబ్బంది పాల్గొన్నారు..