భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలంలో చర్ల రోడరాజుపేట కాలనీ లో, రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లపైకి వరద నీరు రావడాన్ని కాలనీ ప్రజలు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రజలతో పాటు వారి కాలనీ కి వెళ్లి పరిస్థితులు తెలుసుకొని అధికారులు దృష్టికి తీసుకొని వెళ్లారు. వెంటనే స్పందించిన పంచాయతీ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వచ్చి డ్రైనేజ్ నీరు నిలవడానికి గల కారణాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. డ్రైనేజ్ వ్యవస్థ లేక ఇబ్బందులు జరుగుతున్నాయని తెలిపారు. వెంటనే డ్రైనేజ్ బ్లాక్ చేసిన ప్రదేశానికి వెళ్లి డ్రైనేజ్ బ్లాక్ చేసింది నిర్మాణాలు చేసిన వారు నిర్మాణాలను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కి రాజుపేట కాలనీ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.