భద్రాచలం కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలి,పెండింగ్ వేతనాలు చెల్లించాలి

హాస్పటల్ సూపరిండెంట్ రామకృష్ణ కు సమ్మె నోటీసు అందజేత

భద్రాచలం నేటి ధాత్రి

కార్మికుల హక్కుల సాధన కోసం జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి-CITU

ప్రభుత్వ ఏరియా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, క్రిటికల్ కేర్, సెక్యూరిటీ విభాగాలలో కాంట్రాక్ట్ పద్ధతిని ఎత్తివేసి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని సిఐటియు భద్రాచలం పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి లు డిమాండ్ చేశారు. కృష్ణ అధ్యక్షతన జరిగిన హాస్పిటల్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జరిగే సమ్మె, గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను నిర్వీర్యం చేస్తోందని అన్నారు. పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని కనీస వేతన చట్టం ప్రకారం కార్మికులకు 26 వేల రూపాయలు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. గత మూడు నెలలుగా హాస్పటల్ శానిటేషన్ కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 16న జరిగే సార్వత్రిక సమ్మెలో హాస్పటల్ శానిటేషన్ వర్కర్స్ పాల్గొంటున్నట్లు హాస్పిటల్స్ సూపర్డెంట్ రామకృష్ణ కి సమ్మె నోటీసు అందించడం జరిగింది.పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే సార్వత్రిక సమ్మె అనంతరం నిరవధిక సమ్మె సమ్మెకు పూనుకుంటామని వారు తెలిపారు… ఈ సమావేశంలో రమాదేవి, నరసింహారావు, ఎంవి రమణ, భవాని, ఎం చిట్టెమ్మ, జి మమతా, ఎస్ కే మహబూబ్, జి కుమారి, అంజలి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *