
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం నియోజకవర్గం లోని పట్టభద్రుల ఓట్ల అభ్యర్థన ఖమ్మం,నల్లగొండ,వరంగల్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ భద్రాచలం నియోజకవర్గ టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో కలిసి భద్రాచలం నియోజకవర్గంలోని పాలు ప్రాంతాల్లో పర్యటించారు..పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, బీజేపీ పాలకులు చేసిందేమీ లేదని విమర్శించారు. కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదని తెలిపారు. పట్టభద్రులు, ప్రజల పక్షాన చట్ట సభలో గొంతుక వినిపించేందుకు తీన్మార్ మల్లన్న ను గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు