*గోపగాని సప్తగిరి, సీనియర్ జర్నలిస్ట్*
*”నేటిధాత్రి” హనుమకొండ*
ఫేక్ న్యూస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సీనియర్ జర్నలిస్ట్ గోపగాని సప్తగిరి అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని సిడిఓఈ లో గల జర్నలిజం విభాగంలో జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్ ఆధ్వర్యంలో అతిధి ఉపన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ గోపగాని సప్తగిరి “ఫ్యాక్ట్ చెకింగ్ ఆఫ్ ఫేక్ న్యూస్” ( తప్పుడు వార్తల పై వాస్తవ తనిఖీ ) అనే అంశంపై సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని ఇస్తూ వెబ్ ప్రపంచాన్ని తప్పుడు సమాచారం ముంచెత్తి వేస్తోందని.. సమాజానికి ఇదో సవాల్ గా మారిందని గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ సప్తగిరి గోపగాని హెచ్చరించారు. ఫేక్ న్యూస్ కి చెక్ పెట్టడానికి గూగుల్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ఫ్యాక్ట్ చెకింగ్ కి సంబంధించిన టూల్స్ వినియోగించుకోవడం ద్వారా సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ ని అరికట్టవచ్చని సూచించారు. కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం విద్యార్థులకు ఫ్యాక్ట్ చెకింగ్ పై సప్తగిరి అవగాహన కల్పించారు. ఫేక్ న్యూస్ కనిపెట్టడానికి.. వాటి మూలాలు కనుక్కోవడానికి అవసరమైన పలు టూల్స్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కంజర్ల నరసింహా రాములు, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు,డాక్టర్ శంకర్, డాక్టర్ చిరంజీవి,జర్నలిజం మొదటి,ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.