నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.సత్య శారద
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థుల కు మెరుగైన వసతులు కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
నర్సంపేట లోని ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలలను గురువారం కలెక్టర్ సందర్శించి ఆసుపత్రి ఆవరణతో పాటు కళాశాల లెక్చర్ హాల్, హాస్టల్ యందు పర్యటించి వైద్య విద్యార్థులలో మాట్లాడి వారికి అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది సంబంద అంశాలు తన దృష్టికి రావడం జరిగిందని శానిటేషన్ గురించి నర్సంపేట మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయనున్నట్లు,హాస్పిటల్ యందు ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి పేషెంట్ సేవలు అందించేందుకు చర్యకు చేపడతామని అన్నారు.అధికారులు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు.
అంతకు ముందు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో గల డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ నిర్వహిస్తున్న రిజిస్టర్ ను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య కళాశాల నియంత్రణలోకి తెస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టి వి వి పి)ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఇందుకు సంబంధించిన విషయాలతో పాటు వైద్య కళాశాలలో పూర్తి స్థాయిలో చేయాల్సిన ఏర్పాట్లపై త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.మోహన్ దాస్ ప్రో.రమేష్,ఎమ్మార్వో రాజేష్, తదితరులు పాల్గొన్నారు.