బాలికలు సమాజానికి మణిహారం*సూపర్వైజర్ ఆండాళ్
ఎండపల్లి,జగిత్యాల నేటి ధాత్రి
ఎండపల్లి మండలం గుల్లకోట ఉన్నత పాఠశాలలో బాలికల భవిష్యత్తుకు భేటీ బచావో భేటీ పడావో ప్రతిజ్ఞ కార్యక్రమం చేయడం జరిగింది, ,బాలికలు సమాజానికి మణిహారం, బాలికలకు రక్షణ కల్పిద్దాం, వారి బంగారు భవితకు పునాది వేద్దాం, స్వేచ్ఛాయుతమైన వాతావరణం మరియు పోషకాహారం అందించి, వారి అభివృద్ధికి అందరం తోడ్పడదాం ,బాలికలను బ్రతకనిద్దాం, చదవనిద్దాం 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేద్దాం మన వంతు సహాయం అందించి వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని తెలియజేస్థు ప్రతిజ్ఞ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచంద్రం సూపర్వైజర్ ఆండాళ్ , అంగన్వాడీ ఉపాధ్యాయురాల్లు భూసారపు భూలక్ష్మి , పోడేటి సువర్ణ ,దావుల గంగ జమున మరియు బాలికలు పాల్గొన్నారు
ఉన్నత పాఠశాలలో బేటి బచావో బేటి పడావో ప్రతిజ్ఞ కార్యక్రమం!!
![](https://netidhatri.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-22-at-14.04.08_92331f73.jpg)