
బోయినిపల్లి, నేటి ధాత్రి:
బిజెపి జిల్లా అధ్యక్షులుగా ప్రతాప రామకృష్ణ మూడోసారి ఎన్నికైన సందర్భంగా గురువారం రోజున వేములవాడలో భారతీయ జనతా పార్టీ బోయినిపల్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలుపడం జరిగినది, ఈ కార్యక్రమంలో బిజెపి చొప్పదండి నియోజక వర్గ కొ- కన్వీనర్ ఉదారి నర్సింహా చారీ, బిజెపి మండల ఉపాధ్యక్షులు ఇల్లేందుల బాలయ్య,పాళోజి రాజేంద్ర ప్రసాద్, కొండం శ్రీనివాస్ రెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు సారంపెల్లి రాజు, బిజెపి నాయకులు జనగామ లక్ష్మన్, బోగోజీ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.