క్విజ్ పోటీలో గెలుపొందిన విద్యార్థుల కు బహుమతులు అందజేత
పరకాల నేటిధాత్రి(టౌన్)
పరకాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో షాహీద్ సింరంగి.సౌందరయ్య దగ్గు వెంకన్న, సూరినెని భీమన్న,గొడిశాల అరవింద్ గౌడ్ ల స్మారకార్థం ఉత్తమ విద్యార్థి అభినందన సభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఏబీవీపీ హన్మకొండ ప్రముఖ్ గౌడ రాజేందర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.మరణించిన డాక్టర్ సౌందరయ్య,వెంకన్న, భీమన్న,అరవింద్ గౌడ్ చిత్ర పఠాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గౌడ రాజేందర్ మాట్లాడుతూ 1948 లో ఢిల్లీ యూనివర్సిటీ లో నలుగురితో ప్రారంభమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు 50లక్షల సభ్యులతో ప్రపంచంలోనే ఒక పెద్ద విద్యార్థి సంఘం గా ముందుకు వెళ్తుందని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు దేశ భక్తి ని పెంపొందించుకోవాలని , చుట్టూ ఉన్న సమస్యలను సవాళ్ళను అధిగమించి దేశంలో వివిధ రంగాల్లో ప్రతిభ చూపి అభివృద్ధి లో భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు.అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థుల్లో వ్యక్తి నిర్మాణం , దేశభక్తి,పెంపొందిస్తూ,విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలను చేస్తూ విద్యార్థుల పక్షాన గత 75 సంవత్సరాలుగా నిలుస్తోంది అని రాజేందర్ అన్నారు.అనంతరం పలు పాఠశాలలు,కళాశాలలో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు.వ్యాస రచన, రంగవల్లి,క్విజ్ పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ హన్మకొండ సంఘటన కార్యదర్శి హర్షవర్ధన్ , హన్మకొండ జిల్లా కన్వీనర్ అయిత నిఖిల్,పరకాల నగర కార్యదర్శి వావిలాల వెంకట రమణ,పూర్వ కార్యకర్తలు సయ్యద్ గాలిఫ్, సూర రాజేందర్, మేఘనాథ్,రంజిత్,అమరవీరుల కుటుంబ సభ్యులు,ఏబీవీపీ కార్యకర్తలు,వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.