బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లక్కీ డ్రా
భూపాలపల్లి నేటిధాత్రి:
2025 -26 సంవత్సరమునకు గాను బెస్ట్ అవైలబల్ స్కూల్స్ స్కీం పథకం క్రింద 1వ తరగతి 5వ తరగతి లో ప్రవేశము కొరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి మీటింగ్ హాల్ లో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా స్కీం నిర్వహించడం 1వ తరగతికి (41) సీట్లు గాను (1) అధర్శ హై స్కూల్ కు – 08, (2) వివేకానంద హై స్కూల్ కు – 08, (3) సెయింట్ పీటర్స్ హై స్కూల్ కు- 09, (4) సువిద్యా హై స్కూల్ కు – 08, (5) సి ఎస్ ఐ మెమోరీస్ కు – 08, 5వ తరగతికి (43) సీట్లు గాను (1) అధర్శ హై స్కూల్ కు – 14, (2) వివేకానంద హై స్కూల్ కు 14, (3) సువిద్యా హై స్కూల్ కు -15, సీట్లు లక్కీ డ్రా పద్దతి లో కేటాయించడం జరిగినది. లక్కీ డ్రా స్క్రీన్ కార్యక్రమంలో నందు విజయ లక్ష్మీ జిల్లా అడిషనల్ కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి రాజేందర్ జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి టి డబ్ల్యూ ఆర్ ఎస్ జిల్లా కొ-ఆర్డినేటర్ స్కూల్ ప్రిన్సిపల్స్, విద్యార్ధిని, విద్యార్ధులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.