•ఆర్థిక సాయం అందజేసి గ్రామయువకులు
నిజాంపేట: నేటి ధాత్రి
కన్నవారిని కోల్పోయి అనాధాలైన ఇద్దరు ఆడపిల్లలకు దాతలు అండగా నిలుస్తున్నారు ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రానికి చెందిన చెర్విరాల శ్రీనివాస్ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగించేవాడు. కరోనా సమయంలో భార్యను కోల్పోయాడు. గత కొంత కాలం క్రితం అనారోగ్య సమస్యలతో శ్రీనివాస్ మృతి చెందారు. దీంతో 15 సంవత్సరాల లోపు ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారు. వారికి మండల కేంద్రానికి చెందిన యువకులు చందాల రూపం లో డబ్బులు జమ చేసి 63,500 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా దాతలు ఉంటే వారికి ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిపి స్వామి, పంజా బాబు, సిద్ధిరామిరెడ్డి, వడ్ల నాగరాజు, శ్రీనివాస్ గౌడ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు