భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘము రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ మాట్లాడుతూ పదవి విరమణ పొందిన 30 సంవత్సరాల పైగా కస్టపడి కంపెనీ ఉత్పత్తి కోసం చెమట వడిపి కష్టం చేసిన రిటైర్మెంట్ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్, గ్రాట్యుటీ, పిఫ్, ల తో పాటు పెన్షన్ కూడా రిటైర్ అయినా మరుసటి నెల నుండే వర్తింప చేయాలి.2021 జులై 1 నుండి బొగ్గు గని కార్మికులు 11 వ వేతన ఒప్పందం పరిధి లోకి రావడం జరిగింది. ఆగస్టు 31 లోపు 2023 ఇప్పటివరకు ఇవ్వలేదు. రిటైర్మెంట్ అయినా వారికీ తక్షణమే ఎర్రియర్స్ బకాయి లు చెల్లించాలి.లాభాల వాటా 2022 ఏప్రిల్ 1వ తారీకు నుండి మర్చి 31 వరకు వెంటనే చెల్లించాలి.
రిటైర్డ్ కార్మికుల వద్ద సంస్థ కు రావాల్సిన బకాయిలను వెంటనే కోత పెడ్తుంది. కానీ వాళ్లకు రావాల్సినవి మాత్రం రావడం లేదు. రిటైర్ అయినా తరువాత ఆరు నెల్ల వరకు వాళ్లకు పెన్షన్ మరియు వచ్చే బెనిఫిట్స్ ఆరు నెల్ల వరకు రాకపోతే వాళ్ళ కుటుంబాలు జీవనోపాధి కష్టముగా మారుతుంది.
సింగరేణి ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఇలా చెప్పే సంస్థ రిటైర్డ్ ఎంప్లాయ్స్ కి సకాలంలో రావాల్సిన బెనిఫిట్స్ రిటైర్ అయినా వెంటనే అతనికి చెక్కు రూపం లో అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని తెలంగాణ బొగ్గు లోయ కార్మిక సంఘము డిమాండ్