వరంగల్/ నర్సంపేట/సంగెం,నేటిధాత్రి :
వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఎల్గురి రంగంపేట గ్రామానికి చెందిన నాయిబ్రాహ్మణుడు శ్రీరాముల స్వామి (75) అనారోగ్యంతో మరణించగా నాయిబ్రాహ్మణ సేవాసంఘం గీసుగొండ మండల అధ్యక్షుడు యాదగిరి శ్యామ్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు ఆ కుటుంబానికి అండగా ఉండి, స్వామి భార్య సరోజనకు సోమవారం 6 వేల 500 రూపాయలు ఆర్ధిక సహాయం చేసి ఆదర్శంగా నిలిచారు. ఆర్ధిక సహాయం చేసిన నాయిబ్రాహ్మణ సోదరులకు శ్యామ్ కృతజ్ఞతలు తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో నాయిబ్రాహ్మణ సేవాసంఘం గీసుగొండ మండల కార్యదర్శి శ్రీరాముల రమేష్, కోశాధికారి తంగెళ్లపల్లి రమేష్,పొదుపు సంఘం అధ్యక్షుడు యాదగిరి కుమారస్వామి, నర్సంపేట మండల అధ్యక్షుడు గొలనకొండ రవీందర్, శ్రీరాముల రవిచందర్, భాస్కర్, యాసాల అనిల్, కమలాకర్, ప్రసాద్, లింగం తదితరులు పాల్గొన్నారు.