ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి
ఎండపల్లి మండల కేంద్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత ఎంపీటీసీ సభ్యులు మహ్మద్ బషీర్ యొక్క మాతృమూర్తి వొజ్రబి ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది, ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ప్రస్తుత బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ ఎంపీటీసీ బషీర్ నివాసానికి విచ్చేసి వారి కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం వోజ్రబి ఆత్మకు శాంతి చేకూరాలని పుష్పాంజలి ఘటించి , కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు ,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు