బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ లో కనీస సౌకర్యాలు లేవు ‌

బెల్లంపల్లి నేటిధాత్రి :

బెల్లంపల్లి నియోజకవర్గం ‌ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ సందర్శించిన జేఏసీ నాయకులు వారు మాట్లాడుతూ, బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ పరిస్థితి,ఎక్కడ తీసిన గొంగడి అక్కడే అన్నట్టుగా, పరిస్థితిలో మార్పు లేదు గత రెండు నెలల క్రితం హాస్పటల్ స్థితిగతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా, వారు, సానుకూలంగా స్పందించి, హాస్పిటల్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామని, తెలిపారు. ఇంతవరకు అందులో ఎలాంటి పురోగతి రాకపోవడం రోగులు అవస్థలు పడడం చిన్న సమస్య పైన రిపేర్ చేయడం లాంటి సమస్యలు హాస్పిటల్లో నెలకొన్నాయని వారు తెలిపారు, ఎమ్మెల్యే ఎప్పుడు కలిసినా చేస్తాను చూస్తాను అనడమే తప్ప, వర్క్ జరగడం లేదని వారు తెలిపారు. హాస్పిటల్ సూపర్డెంట్ , కు కలిసి, సమస్యలను వివరించామని వారు సానుకూలంగా స్పందించాలని, మాకు సూపర్డెంట్ పై పూర్తి నమ్మకం ఉందని, అలాగే ప్రజా ప్రతినిధులు దీనిపై దృష్టి పెట్టి సమస్యలను పరిష్కారం చేయాలని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో, టి ఎన్ టి యు సి, నాయకుడు మని రామ్ సింగ్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *