రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈసందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి దాసరి రవి శాస్త్రి మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దృష్ట్యా బస్టాప్ వద్దకు వచ్చే ప్రయాణికులు, రోడ్డు వెంట వెళ్లే వివిధ గ్రామాల ప్రజల దాహం తీర్చుకునేందుకై చలివేంద్రం ప్రారంభించామని తెలిపారు. ఈకార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు దాసరి కనుకయ్య, సంయుక్త కార్యదర్శి వడ్లురి సిద్దు, కార్యవర్గ సభ్యులు తడగొండ మల్లేశం, దాసరి సంపత్, సేవాసంస్థ సభ్యులు ఆరెల్లి రాజశేఖర్, ఈరెల్లి శశికుమార్, దాసరి చంద్రయ్య, రేణిగుంట అశోక్, దాసరి రాజయ్య, దాసరి మోహిత్, రేణికుంట బాపురాజు, ముదిగంటి మధురెడ్డి, దాసరి రాజేందర్ రెడ్డి, లింగంపెల్లి రవి, ఈరెల్లి నర్సయ్య, సిపెల్లి పోచయ్య, కొలిపాక నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.