
Water Supply.
నల్లాల నీళ్లు రాకపోవడంతో
రవినగర్ గ్రామస్తుల నిరసన
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని పరశురాంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రవి నగర్ లో నల్లాలు రాకపోతుండడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా గ్రామస్తులు గ్రామంలో నీటి వసతి కొరకు ఏర్పాటుచేసిన బోర్ లు పనిచేయకపోతుండటంతో పాటు ఓహెచ్ ద్వారా అందించాల్సిన తాగు నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి తమకు నీటి వసతి ఏర్పాటు చేయాలని శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.