నీతులు చెబుతాడు..గోతులు తీస్తాడు!

https://epaper.netidhatri.com/view/374/netidhathri-e-paper-11th-september-2024%09

`తన ప్రకటనలతో గుండూబాస్‌ అదరగొడతాడు.

`తన చేతికి గ్రాము బంగారం పెట్టుకోడు.

`జనం చేత బంగారం కొనిపిస్తాడు!

`అగ్గువ, అగ్గువ అని ఆగం చేస్తున్నాడు.

`బంగారంలో కల్తీ ఆరోపణలు ఎదుర్కొన్నాడు!

`పాలకుల అలసత్వంతో ప్రజల సొమ్ము దిగమింగుతున్నాడు?

`జిఎస్టీలోనే మోసం చేశాడు!

`తప్పుడు లెక్కలు చూపాడు!

`కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎగనామం పెట్టాడు.

`వ్యాపారాన్ని ప్రచారాన్ని కలిపి దోచుకుంటున్నాడు?

`నాణ్యత లేని బంగారాన్ని అంటగడుతున్నాడు?

`తూకంలో తేడాలు కూడా అప్పట్లో బైటపడ్డాయి!

`ప్రజలు మర్చిపోయారనుంటే పొరపాటు?

`ప్రభుత్వానికి కోట్లు ఎగ్గొట్టి, విరాళం పేరుతో పబ్లిసిటీ మొదలుపెట్టాడు!

`మోసాలు చేసేవారే నీతులు చెబుతారు?

`నమ్మించి, నమ్మించి బిచాణా ఎత్తేస్తారు!

`కంసాలీలను( గోల్డ్‌ స్మిత్‌) రోడ్డున పడేస్తున్నాడు!

`ఇలాంటి మోసగాళ్ల వల్ల కుల వృత్తి వదలి కూలీ చేసుకుంటున్నారు.

`బంగారం దుకాణాల పేరుతో తెలంగాణ కులవృత్తి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు.

`కంసాలీలంతా ఏకమైతే ఇలాంటి మోసగాళ్లను తరిమేడం పెద్ద లెక్క కాదు!

`ప్రజలారా! తస్మాత్‌ జాగ్రత్త!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తియ్యని మాటల వెనుక చేదుగుళికలుంటాయి. నవ్వుతూ మాట్లాడే మాటల వెనుక గోతులుంటాయంటారు. లలిత జ్యూవెర్లర్‌ అధినేత చెప్పే మాటల్లో కూడా నిజం ఆవగింజంత కూడా లేదని తెలుస్తోంది? డబ్బులు ఊరికే రావు అంటూ ఆయన ఇచ్చే బంగారంలో స్వచ్ఛత ఎంత అన్నదానిపై స్పష్టత ఎవరివ్వాలి? ప్రకటనలు ఇస్తున్నారు కదా? అని మీడియా కూడా నిజనిజాలు నిగ్గు లేల్చకపోవడం బాదాకరం. ప్రభుత్వాలు కూడా వ్యాపార వేత్తలను ప్రోత్సహించే పేరుతో దోపిడీ దారులకు కొమ్ము కాయడం కూడా సరైంది కాదు. సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నత స్ధాయి వరకు ప్రతి వ్యక్తి ప్రతి వస్తువుకు జిఎస్టీ చెల్లిస్తున్నారు. సంపన్నులు, ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయంకు పైబడి వున్న వారంతా ఇన్‌కమ్‌ టాక్స్‌ కడుతున్నారు. అయితే ఎంత మంది వ్యాపారులు డబ్బులు ఎగవేత దారుల్లో వున్నారో తెలియంది కాదు. వ్యాపారం పేరుతో ఏ వ్యక్తి తన సొంత సంపాదనలను పెట్టుబడులుగా పెట్టరు. అది చిన్న వ్యాపారమైనా, పెద్ద వ్యాపారమైన సరే బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటారు. దాంతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంటారు. సహజంగా బ్యాంకులో పది లక్షలు వుంటేనే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అదికారులు నోటీసులు ఇస్తున్న ఈ సమయంలో వేల కోట్ల ఆదాయాలున్నవారు, పన్నులు ఎగ్గొడుతుంటే చూస్తూ వుంటున్నారని చెప్పడానికి లలిత జెవెల్లరీ షాపులే నిదర్శనం. ప్రజల నుంచి జీఎస్టీ రూపంలో వసూలు చేసిన సొమ్మును ప్రభుత్వానికి చెల్లించకుండా, మోసం చేయడం, వాటిని తిరిగి పెట్టుబడిగా పెట్టి, వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం అలవాటు చేసుకుంటున్నారు. మాటలు మాత్రం ఈ అదినేత చాలా గొప్పగా చెబుతుంటారు. అయితే ఇటీవల విజయవాడ నీట మునిగింది. ప్రజలకు సహాయసహాకారాల కోసం లలిత జెవెల్లర్స్‌ అధినేత కిరణ్‌కుమార్‌ కోటి రూపాయలు ప్రభుత్వానికి అందజేశారు. కాని అందులో టాక్స్‌ బెనిఫిట్స్‌ దాగి వుంటాయన్న సంగతి సామాన్యులకు తెలియదు. కాని విరాళం ఇస్తూనే మరో వైపు ప్రచారాస్త్రంగా దానిని వాడుకున్నాడు.. ప్రజల మీద అత్యంత ప్రేమను చూపించినట్లు నటిస్తుంటాడు. సహజంగా ఏ బంగారం దుకాణంలోనైనా ఇంతకు ముందు ప్రజలు కొనుగోలు చేస్తే దానిపై సదరు ప్రాంత వ్యక్తులపై అత్యంత నమ్మకం వుండేది. ఆ బంగారం అవసరం మేరకు అమ్మకాలు చేసుకున్నా, తిరిగి డబ్బు చేతికి వచ్చేది. ఎప్పుడైతే లలిత జెవెల్లర్స్‌ ఉభయ తెలుగు రాష్ట్రాలలో బంగారు నగల వ్యాపారం మొదలు పెట్టారో అప్పటి నుంచి కంసాలి వృత్తి దారులకు తీరని నష్టం ఎదురౌతోంది. ఇలాంటి సంస్ధల మూలంగా తెలంగాణలో కంసాలి కుల వృత్తిని తరరాలుగా నమ్ముకున్న వాళ్లంతా కూలీలుగా మారిపోయారు. వారి వృత్తిని కోల్పోయి రోడ్డున పడ్డారు. బంగారు నగల వ్యాపారుల ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల మోడళ్ల పేరుతో తయారు చేసే నగలలో ఎంత నాణ్యత అన్నది చెప్పడం కష్టం. గతంలో సోమాజిగూడ లలిత షోరూంలో నాణ్యత లేని బంగారం విక్రయించినట్లు కూడా పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. కాని ఆ కేసు ఏమైందన్నది ఎవరికీ తెలియదు. పెద్ద పెద్ద వ్యాపార సంస్ధలు ఇలా మోసాలు చేసినా, బైటకు రావు.

తాను మాత్రం చేతిలో కనీసం గ్రాము బంగారు వస్తువు కూడా ధరించరు. కాని ప్రజల చేత బంగారం కొనుగోలు చేయండి. అంటూ నిత్యం వ్యాపార ప్రకటనలతో కిరణ్‌కుమార్‌ ఊదరగొడుతుంటాడు. బంగారాన్ని ప్రజలకు పెట్టుబడిగా ప్రచారం చేస్తాడు. బంగారం ధర తగ్గిందని కొనుగోలు చేయంటాడు. బంగారం కిలో కోటి రూపాయలకు చేరుతుందని భయపెడుతుంటాడు. బంగారం ధర నిర్ణయించేది ప్రభుత్వం. కాని ఎప్పటిప్పుడు యూట్యూట్‌ ఛానళ్లకు వచ్చి, బంగారం ఎందుకు కొనాలి? బంగారం మీద ప్రజలు ఎలా పెట్టుబడి పెట్టాలి? బంగారం భవిష్యత్తులో ఎలా పెరుగుతుంది? అంటూ చెప్పి ప్రజలకు ఆశలు కల్పిసాడు. సహజంగా ఇంట్లో రూపాయి వుంటే దానిని పొదుపు చేసుకువారిని బంగారం కొనుగోలు వైపు ఆలోచనలు మళ్లిస్తాడు. గతంలో కూడా అనేక బంగారు దుకాణాలు వున్నాయి. కాని వాటి యజమానులు ఇలా ప్రజలను మభ్యపెట్టేలా స్వయంగా వాళ్లే ప్రచారం చేసుకోలేదు. తమ సంస్దల ప్రకటనలు మాత్రమే చేసుకుంటారు. కాని ఒక్క లలిత జెవెల్లర్స్‌ అధినేత మాత్రమే బంగారంపై నిత్యం ప్రజల్లో భ్రమలు కల్పిస్తారు. ప్రజలను బురిడీ కొట్టిస్తాడు. బంగారంపై లేని పోని ప్రకనటలు చేస్తుంటాడు. కేవలం తన వ్యాపారం కోసం ప్రజలకు మాయ మాటలు చెబుతుంటాడు. వ్యాపార పరంగా తన సంస్ధలో బంగారం కొనుగోలు చేయమని చెప్పడం ఒక పద్దతి. కాని ఆయన మాత్రం మా షాపులో మాత్రమే ఎందుకు కొనాలో అంటూ లేని పోని అపోహలు సృష్టిస్తాడు. నిజానికి బంగారంలో ఎంత ఇతర ఇతర లోహాలు కలుపుతారో అందరికీ తెలుసు. కాని వన్‌ గ్రామ్‌ బంగారు నగల పేరుతో లలిత జువెల్లర్స్‌ చేస్తున్న మోసాలపై ప్రజలు అప్పట్లో బాగానే నిలదీశారు. పేరుకు వన్‌ గ్రామ్‌ అంటూ అమ్మే వస్తువులు భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి ఉపయోగం వుండదు.

సంపన్నులు ఒకేసారి ఎంత బంగారం కొన్నా వ్యాపారులకు లాభాలు వుండవు. కాని వన్‌ గ్రామ్‌ పేరుతో పెద్దఎత్తున బంగారు నగలపై ఆశలు కల్పించి అమ్మకాలు సాగించడం వ్యాపారంలో పెద్ద మోసం. మహిళలకు సహజంగా బంగారం అంటే ఎంతో ఇష్టం. అయితే సామాన్యులు తులం బంగారం కొనుగోలు చేయాలంటే ఈ రోజుల్లో సాద్యం కాదు. దాంతో వారికి బంగారం మీద ఆశలు తీరక జీవితంలో ఏదో వెలితితో వుంటారు. అలాంటి వారిని పెద్దఎత్తున ఆకర్షించి వన్‌ గ్రామ్‌ బంగారం పేరుతో నగల తయారు చేయించి, అమ్మకాలు సాగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తులం బంగారు నగలనే కరిగిస్తే వచ్చేది ఎంతో ప్రజలందకీ తెలుసు. నగల్లో తరుగు ఎంత పోతుందో తెలియంది కాదు. పెద్దపెద్ద షాపులు ఏర్పాటు చేసుకొని, రంగురంగుల లైట్లు, అంతస్ధుల మేడల్లో బంగారుదుకాణాలు పెట్టుకునేవారు వన్‌ గ్రామ్‌ బంగారు నగలు ఎందుకు అమ్ముతున్నారన్నది ఎవరూ ఆలోచించడం లేదు. పది వేలు పెట్టి వన్‌ గ్రామ్‌ బంగారు నగ కొనుగోలు చేస్తే వచ్చే లాభం ఏమీవుండదు. ఏదైనా అసరం కోసం ఆ నగ తాకట్టు పెడదామన్నా ఎవరూ తీసుకోరు. అదే సంస్ద ఆ నగను తీసుకొని డబ్బులు ఇవ్వదు. అంటే డబ్బులు ఊరికే రావంటూ ఊదరగొట్టి జనం సొమ్మును లూటీ చేయడం తప్ప ఏమీ వుండదు. ఇందులో వున్న మర్మం తెలియన వాళ్లు చాలా మంది మోస పోతున్నారు. ఇది వరకు రోల్డ్‌ గోల్డ్‌ నగలు తక్కువ ధరకు ఖరీదు చేసుకునే మహిళలు వన్‌ గ్రామ్‌ బంగారం కోసం అప్పులు చేసి మరీ కొనుగోలు చేసుకుంటున్నారు. బంగారం ధరలు పెరుగుతున్నాయంటే ఎగబడి కొంటున్నారు. అసలు సిసలైన బంగారం షాపుల్లో వన్‌ గ్రామ్‌ బంగారు నగలు అందుబాటులో వుండవు. సామాన్యులకు సైతం బంగారు నగలు అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రచారం చేసుకునే షాపుల్లో మాత్రమే ఇలాంటి మోసాలు పెద్దఎత్తున జరుగుతుంటాయి. బంగారం పేరుతో షాపులోకి వచ్చిన వారెవరూ తిరిగి డబ్బులతో ఇంటికి వెళ్లకుండా వారి జేబులు ఖాళీ చేయించడంలో లలిత జువెల్లరీ ఆరితేరిపోయింది. అందుకే ఊరికో షాపు వెలుస్తోంది. కొన్ని దశాబ్థాలుగా బం గారం వ్యాపారం చేస్తున్న పెద్ద సెద్ద సంస్థలు కూడా ఇన్నిన్ని షాపులను ఎందుకు ఏర్పాటు చేయలేపోతున్నాయి. ఒకసారి బంగారు వస్తువు వన్‌ గ్రామ్‌పేరతో కొనుగోలు చేసిన వాళ్లు మోసపోయామని షాపుకు వచ్చి చెప్పుకున్నా, ఇంత కాలం పెట్టుకోవడం వల్ల అరిగిపోయింది. తరిగిపోయిందని సమాదానం చెప్పే అవకాశం లతిత జెవెల్లర్స్‌లో వుంటుంది. అందుకే ప్రజలను డబ్బులు ఊరికే రావంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడు. షాపుల మీద షాపులు పెంచుకుంటూ పోతున్నాడు. మరో వైపు ప్రభుత్వానికి జిఎస్సీలు ఎగ్గొడుతున్నాడు. ఏ వ్యాపారం చేసినా సామాన్యులే టార్గెట్‌గా సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. సరిగ్గా ఓ రెండు దశాబ్దాల క్రితం వరకు కూడా ఇలాంటి బరితెగించిన వ్యాపారం ఎక్కడా లేదు. మరి ప్రజలు ఇప్పటికన్నా పాత కాలంలోనే ఎక్కువ బంగారు నగలు విరివిగా వాడుకునేవారు. ప్రతి మహిళ మెడలో బంగారుగుండ్లు వుండేవి. కాని ఇలాంటి వ్యాపారుల మూలంగా కంసాలిలు మునిగిపోయారు. ప్రజలు మోసపోతున్నారు. వ్యాపారులు వేల కోట్లు సంపాదిస్తున్నారు. అందర్ని బురిడీ కొట్టిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!