వైద్య సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆదేశం
మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 7
సమయపాలన పాటించండి..ప్రజలకు అందుబాటులో ఉండండి..మెరుగైన వైద్య సేవలను అందించండి..మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోండని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పిడిసిల్ల సబ్ సెంటర్ తో పాటు మొగుళ్లపల్లి మండల ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిడిసిల్ల సబ్ సెంటర్ లో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని పరిశీలించారు. అదేవిధంగా సబ్ సెంటర్ లో రికార్డులను తనిఖీ చేసి ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ స్వప్న మరియు ఏఎన్ఎం, ఆశాలకు తగు సూచనలు చేశారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా గూర్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి, ఏఎన్ఎంలకు, ఆశాలకు పూర్తిగా వివరణ ఇచ్చారు. మహిళల ఆరోగ్య పరీక్షల గురించి ప్రతి గ్రామంలోని మహిళలకు తెలియజేసి, ఎక్కువ సంఖ్యలో మహిళలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించి వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. ఈ క్రమంలో మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి విధుల్లో చేరినప్పటి నుండి ఓపిల సంఖ్య పెరగడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణితో పాటు డాక్టర్ నవత, సబ్ సెంటర్ డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, హాస్పటల్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.