ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
గతంతో పోలిస్తే పెరగనున్న వేడి గాడ్పుల సంఖ్య
వృద్ధులు, పిల్లలు, మహిళలు జాగ్రత్తలు తీసుకోక తప్పదు
రాజధాని ఢల్లీిలో కాలుష్య నివారణ చర్యలు
పంజాబ్, హర్యానా, యు.పి.ల్లో ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులకు ప్రోత్సాహం
సాధ్యమైనంత ఎక్కువ గడ్డిని పశుగ్రాసంగా మలచేందుకు చర్యలు
ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధర ప్రకటిస్తేనే రైతులను ఒప్పించడానికి వీలు
వరిధాన్యాన్ని సేకరిస్తున్న ఎఫ్.సి.ఐ.
రైతులకు లాభం కలిగించే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి
హైదరాబాద్,నేటిధాత్రి:
ఈ ఏడాది వేసవి ప్రారంభమైంది. ఏప్రిల్ 1 వచ్చిందటే వేసవి సీజన్ వచ్చేసినట్టే. ఇది జూన్ 30వరకు కొనసాగుతుంది. ఈసారి దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత అధికంగా వుండబోతున్నదని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. మండే ఎండలు మనుషుల జీవనశైలిపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఎంతోమంది రోజువారీ పనులపై ఆధారపడి జీవనాన్ని గడిపేవారిపై వేసవి ఎండలప్రభావం అధికంగా వుంటుంది. ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు బాగా పెరగడానికి ప్రధాన కారణంమార్చి నెలలో నెలలో వాతావరణం బాగా పొడిగా మారడం. వాతావరణంలో తేమ కొరవడడంతో గాలి తేలిగ్గా వేడెక్కుతుంది. ఫలితంగా ఈసారి దేశంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణో గ్రతలు సాధారణ స్థితికంటే ఎక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ రకమైన ఉష్ణోగ్రత పెరుగుదల కనిపిస్తుంది. ఇదే సమయంలో నైరుతి మరి యు తూర్పు ప్రాంతాలు వేడి గాడ్పుల ప్రభావానికి లోనవుతాయని కూడా వాతావరణశాఖ అం చనా వేసింది. సాధారణంగా ఏప్రిల్`జూన్ మధ్యకాలంలో నాలుగు నుంచి ఆరు వరకు వేడి గాడ్పులు అనుభవంలోకి వస్తాయి. కానీ ఈఏడాది వీటి సంఖ్య ఆరు నుంచి పది వరకు పెరుగుతాయని స్పష్టం చేస్తోంది.
వాతావరణశాఖ వేడి గాడ్పులను ఏవిధంగా నిర్ణయిస్తుందనే ప్రశ్న ఉదయించడం సహజమే. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటి 47డిగ్రీల వరకు చేరతాయో అప్పుడు వేడి గాడ్పులు వీస్తున్నాయని నిర్ణయిస్తుంది. అయితే ఈ వేడిగాడ్పుల అంచనా అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన ఉష్ణోగ్రతల ఆధారంగా నిర్ణయించరు. ఉదాహరణకు మైదాన ప్రాంతాల్లో 40డిగ్రీలకు చేరుకున్నప్పుడు, కొండ ప్రాంతాల్లో 30డిగ్రీలకు చేరినప్పుడు, తీరప్రాంతాల్లో 37డిగ్రీలు నమోదయినప్పుడు, సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4.5డిగ్రీల నుంచి 6.4డిగ్రీల సెల్షియస్ అదనంగా నమోదయినప్పుడు వేడిగాడ్పులు వీస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరుతుంది.
ఏప్రిల్‌ాజూన్ మధ్యకాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే ఎ క్కువ నమోదయ్యే అవకాశాలుండగా, పశ్చిమాద్వీపకల్ప ప్రాంతం, తూర్పుామధ్య మరియు తూర్పు ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక దేశంలోని అధిక ప్రాంతాల్లోమాత్రం సాధారణ గరిష్టం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. అయితేదేశ వాయువ్య భాగానికి చెందిన సుదూర ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోత్రలు నమోదవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఇక దక్షిణ ద్వీకల్ప భారత్‌లోని సూదూర ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. దేశ ఈశాన్య, వాయువ్య భాగాలకు చెందిన కొన్ని సుదూర ప్రాంతాల్లో సాధారణ గరి ష్టం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఇదిలావుండగా సుదీర్ఘ వేడి గాడ్పుల వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావారికీ ఈ పెరిగే ఉష్ణోగ్రతలు ఇబ్బందులు కలుగజేస్తాయి. ఈ నేపథ్యంలో ప్రజాఆర్యోగం దృష్ట్యా జాతీయ విపత్తు నివారణసంస్థ ఇందుకు అనుగుణమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు పరచాల్సి వుంది. ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి వాతావరణశాఖ అందించిన మరో శుభవార్త ఏమిటంటే సాధారణ వర్షపాతం నమోదు కావడం. దేశంలోని పలు ప్రాంతాల్లో, సాధారణ వర్షపాతంలో 88`112% వరకు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దేశ వాయువ్య ప్రాంతాలు, ద్వీపకల్ప భారత్, ఈశాన్య రాష్ట్రాలు, మధ్య, పశ్చిమ ప్రాంతాలకు చెందిన కొన్ని ప్రదేశాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఇక దేశం మిగిలిన ప్రాంతాల్లో ఈ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకానుంది. ఈ శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఈనెలలో ఏప్రిల్ నెలలో 32.6% లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలుండగా, వాయువ్య ప్రాంతాల్లో 41.3%, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 38.6%,మ ధ్యభారత్‌లో 39.3% లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇదే దక్షిణ ద్వీపకల్ప భారత్‌లో మాత్రం 33.6% అధిక వర్షపాతం నమోదు కానున్నదని అంచనా వేసింది.
పంజాబ్, హర్యానాల్లో పంట మార్పిడి ప్రణాళికలు
ఢల్లీి, ఉత్తర భారత్‌లోని చాలా ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న కోసిన త ర్వాత పంట వ్యర్థాలను తగులబెట్టే ప్రక్రియ రాబోయే కాలంలో తగ్గిపోయే అవకాశాలు స్పష్టంగాకనిపిస్తున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని పాలు ప్రాంతాల్లో వరిపండిరచే రైతులు పంట కోతల తర్వాత పెద్ద ఎత్తున పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వాతావరణం కాలుష్య మయమైపోయి, ఇది క్రమంగా ఢల్లీి తదితర ప్రాంతాలకు గాలితోపాటు విస్తరించడంతో వాయు కాలుష్యం పెద్దఎత్తున చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు మోటారు వాహనాలకాలుష్యం కూడా జతకావడంతో ఢల్లీి వాసుల జీవితాలు దుర్భరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఇందుకోసం జరిగిన యత్నాల కారణంగా ఈ రాష్ట్రాల్లో రాబోయే సీజన్‌లో ఐదులక్షల ఎకరాల్లో వరిపంటకు ప్రత్యా మ్నాయంగా పత్తి, మొక్కజన్న వంటి పంటలను సాగుచేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నా రు. ఇందుకోసం ఈ మూడు రాష్ట్రాలు రూపొందించిన ప్రణాళికను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) సుప్రీంకోర్టుకు గతవారం ఒక నివేదికను సమర్పించింది.
పంజాబ్‌లో ఏటా మే నెలలో వరి సీజన్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో సీఏక్యూఎం సభ్యులు మూడు రాష్ట్రాల అధికార్లతో చర్చలు జరిపి వరి విస్తీర్ణాన్ని తగ్గించేందుకు వారు రూపొందించిన ప్రణాళికను కోర్టు ముందుంచారు. 2024 సీజన్‌లో పంజాబ్ రాష్ట్రంలో మొత్తం 3.15మిలియన్ హెక్టార్లలో వరి సాగు జరగ్గా 19.52 మిలియన్ టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అయింది. అదేవిధం గా హర్యానాలో 1.5మిలియన్ హెక్టార్లలో వరి సాగు చేపట్టగా 8.10 మిలియన్ టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అయింది. ఇక ఎన్‌సీఆర్ పరిధిలోకి వచ్చే ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో గత ఏడాది 1,85000 హెక్టార్లలో వరి సాగు చేయగా, 0.74మిలియన్ టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అయింది. ఇది లావుండగా ఈ మూడు రాష్ట్రాలు వరిగడ్డిని తగులబెట్టకుండా, వాటిని సమీపంలోని పరిశ్ర మలకు తరలించి పశువులకు ఆహారంగా తయారుచేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని కూడా ఈ రాష్ట్రాలు హామీ ఇచ్చినటు ఈ నివేదికలో పేర్కొన్నారు.
ఢల్లీాిఎన్‌సీఆర్ (నేషనల్ కేపిటల్ రీజియన్) ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ పర్యావరణ కార్యకర్త, అడ్వకేట్ మెహతా సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు, రాజధాని నగరంలో కాలుష్యానికి ప్రధాన కారకాలను గుర్తించింది. వాహనాలు, విచ్చలవిడిగా పటాసులను పేల్చడం, వరిగడ్డి కాల్చడం వల్ల వస్తున్న ధూళి ప్రధాన కారణాలుగా కోర్టు గుర్తించింది. వీటన్నింటి కారణంగా నగ రంలో కాలుష్యం స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి వాయుకాలుష్యం అత్యధిక స్థాయిలకు చేరు తోంది. ముఖ్యంగా శీతాకాలంలో పంటకోతలు జరుగుతాయి. సరిగ్గా అప్పుడే వరిగడ్డిన తగులబెట్టడం వల్ల నగరవాసులకు నాలుగు వారాలపాటు కాలుష్య నరకం తప్పడంలేదు.
పంజాబ్‌లో ప్రస్తుతం 18 ధాన్యాలనుంచి ఎథనాల్‌ను ఉత్పత్తి చేసే డిస్టిలరీలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 4,90,000 హెక్టార్లలో వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజన్న, చెరకు, పత్తి పంటసాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఏక్యూఎం తెలిపింది. హర్యానా ప్రభుత్వం కూడా 81,000 హెక్టార్లలో పంటమార్పిడికి చర్యలు తీసుకుంటోంది. ఇక ఉత్తప్రదేశ్ ప్రభుత్వం 11వేల హెక్టార్లలో మొక్కజన్న సాగుకు చర్యలు తీసుకుంటోంది.
దేశ రాజధాని నగరంలో కాలుష్య నివారణకు అవసరమైన ప్రణాళికను రూపొందించాల్సిందిగా గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సీఏక్యూఎంను ఆదేశించింది. ఇందుకోసం సంబంధిత అధికార్లతో చర్చలు జరపి ఒక నివేదికను తనుకు సమర్పించాలని కోరింది. పంటమార్పిడిని ప్రోత్సహించేందుకు తాను సిద్ధంగానే వున్నానని పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇందుకు రైతులను ఒప్పించాలి. ఎందుకంటే మొక్కజన్న పంట సాగు చేస్తే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించక తప్పదు. అప్పుడు మాత్రమే వారిని ఒప్పించే అవకాశాలుంటాయి. అదే వరిపంటకైతే ఈబాధలే దు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ వరి ధాన్య సేకరణ చేపడుతుందని, పంజాబ్ ప్రభు త్వం పేర్కొంది. గతవారం సీఏక్యూఎం సమర్పించిన ఈ నివేదికను, ఇంకా కోర్టు పరిశీలించాల్సి వుంది. 1985 నుంచి సుప్రీంకోర్టు ఢల్లీి కాలుష్యంపై దృష్టి సారించినప్పటికీ, 2017లో అడ్వకేట్ మెహతా పిల్ దా ఖలు చేసిన తర్వాత, పంట వ్యర్థాలను విచ్చలవిడిగా తగులబెట్టడాన్ని నిరోధించే చర్యలు చేపట్టా ల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం.