
Heavy Rains.
నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి
వరంగల్ ప్రాంతీయ కేంద్ర పరిశోధన శాస్త్రవేత్తలు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలు సాగు చేస్తున్న రైతులు పంట చేలలో వర్షపు నీటి నిలువలు లేకుండా జాగ్రత్త పడాలని వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ వీరన్న డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రమ్య, మొగుళ్లపల్లి మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డిలు సూచించారు. మొగుళ్ళపల్లి మండలంలో ఇటీవల ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం స్థానిక మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ వీరన్న, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రమ్యతో కలిసి మొగుళ్ళపల్లి మండలంలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మండలంలో సాగు చేస్తున్న పత్తి ,వరి, మొక్కజొన్న పంటల వద్ద ఉన్న రైతులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో కురుస్తున్న అతి భారీ వర్షాలకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పలు సూచనలు అందించారు. పత్తి పంటలో ప్రస్తుతం కురుస్తున్న వర్షపు నీటిని చేనులో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు బయటకు తీసివేయాలని, పత్తి పంట అధిక వర్షాలకు గురైనప్పుడు ప్రతి మొక్క పెరుగుదలకై 19:19:19 పాలిఫీడ్ లేదా 13:0:45 మల్టీకే పోషకాలను లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలని, వర్షాలు తగ్గిన తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియాతో పాటు 20 కిలోల మెరువట పోటాష్ ఎరువులను భూమిలో మొక్కకి 4 అంగుళాల దూరంలో మొదల దగ్గర వేసుకోవాలని, అలాగే పత్తి చేనులో గుంపులు గుంపులుగా మొక్కలు ఎండిపోవడం లేదా వాలిపోవడం గమనించినట్లయితే వేరు కుళ్ళు లేదా భావించి మొక్కలు మొదల చుట్టూ వేరు బాగా తడిచేటట్లు లీటర్ నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును పోసుకోవాలని, పత్తి చేనులో అధికత్తమ ఉన్నప్పుడు ఎకరాకు 10 కిలోల ఏరియాతో పాటుగా 400 నుండి 5 గ్రాముల కార్బన్దజిం + మాన్కోజేబ్ కలుపుకొని మొక్క మొదల దగ్గర వేసుకుంటే పార విల్ట్ ను తగ్గించుకోవచ్చునని శాస్త్రవేత్తలు అన్నారు. ప్రస్తుతం వాతావరణంలో గాలి అధిక తేమతో ఉన్నందున పత్తిలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ, అసికోకైట బ్లైట్ వచ్చే అవకాశం ఉంది, కావున మల్టీకే లాంటి పోషకాలతో పాటుగా క్యాప్తన్+ హెక్సకోనజోల్ 1.5 గ్రాములు లేదా ప్రోపీకొనుజోల్ 1 మిల్లీలీటర్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే నివారించవచ్చునని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. అలాగే వరి పంటలో ఒకవేళ వరి నారు ముదిరినట్లయితే రైతు సోదరులు తప్పకుండా కొనలు తుంచి నాటు వేసుకోవాలి. దీని ద్వారా కాండం తొలచు పురుగు గుడ్లను నిర్మూలించుకోవచ్చన్నారు. నాటు వేసిన 20-25 రోజుల తర్వాత ఎకరానికి 8 నుండి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు తప్పకుండా వేసుకోవాలి తద్వారా కాండం తొలుచు పురుగును నిర్మూలించవచ్చన్నారు. కావున రైతు సోదరులు పైన సూచించిన సూచనలు పాటించి అధిక దిగుబడులు పొందాలని శాస్త్రవేత్తలు పలు గ్రామాల రైతులకు సూచించారు. అలాగే పత్తి పంటలో నీరు నిలబడి మొక్కలు వదలిపోయిన చోట కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు, మరియు ప్లాంటమైసిన్ ఒక గ్రామ్, 10 లీటర్ల నీటితో కలిపి మొక్కల మొదలు దగ్గర పోయాలని, అదేవిధంగా రసం పీల్చే పురుగు ఉధృతి ఉన్నచోట ఇమిడాక్లోఫ్రైడ్ 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలని, గులాబీ రంగు పురుగు ఉధృతి గమనించడం కోసం లింగాకర్షక బట్టలు పెట్టుకోవాలని, అదేవిధంగా మొక్కజొన్నలో మువ్వు పురుగు ఉన్నచోట ఇమమెక్టిన్ బెంజోట్ నాలుగు మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలన్నారు. పెసర పంటలో క్లోరాంత్రిని రోల్ 60 గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేయాలని, వరి పంటలో నీరు తీసివేసి 35 కిలోల యూరియా, 15 కిలోల పోటాష్ వారం రోజుల్లో రెండు దాఫాలుగా వేసుకోవాలని, అదేవిధంగా వరిలో తుంగ నివారణ కోసం florpyrauxifen benzyle+సైహలొఫోప్ butyl, 500 మిల్లీలీటర్ ఒక ఎకరానికి స్ప్రే చేయాలని రైతులకు తెలపడం జరిగిందన్నారు.