ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ..సహాయ, సహకారాలను అందించుకోండి
మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
వేసవికాలంలో సంభవించే అగ్ని ప్రమాదాల పట్ల రైతులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న సూచించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. వేసవికాలంలో భానుడి ప్రతాపం విలయతాండవం చేస్తుండడంతో..ఎండలు మండిపోతున్నాయని, కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గాని, సిగరెట్, బీడీలను అంటు పెట్టుకొని అగ్గిపుల్లలను ఆర్పీ వేయకుండా అజాగ్రత్తగా పారవేయడం వలన ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సహాయ, సహకారాలు అందించుకోవాలని సూచించారు. మంగళవారం రోజున మండల కేంద్రంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదం వలన తాను అధికారులు మేల్కొనకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని ధర్మన్న తెలిపారు.