శాయంపేట నేటి ధాత్రి:
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరిగా ఉండాలని ఎస్సై సూచించారు. మండలంలోని ఎం జె పి పాఠశాలలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించి రోజురోజుకు పెరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాల దృష్ట్యా, శాయంపేట మండల ప్రజలకు తెలవడం కోసం ఆన్లైన్ లోనైనా ఫోన్లోనైనా ఎవరైనా మాయమాటలు చెప్పి డబ్బులు పంపమని లేదా ఓ టీపీ చెప్పమని లేదా ఏదైనా లింకు క్లిక్ చేయమని అడిగితే వారు చెప్పినట్టు మీరు చేస్తే మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బులు క్షణాల్లో మటుమాయం చేస్తారు. కావున మొబైల్ ఫోన్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడగలరు. ఎవరైనా సైబర్ నేరాలకు గురి అయి డబ్బులు పోగొట్టుకున్నట్లయితే, 1930 అను నెంబర్ కు కాల్ చేసి మీరు వివరాలు చెప్పినట్టు అయితే సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా మీ బ్యాంకు ఖాతా నుంచి వేరే బ్యాంక్ ఖాతాకు డబ్బులు వెళ్లిన బ్యాంక్ అకౌంట్ హోల్డ్ అయ్యి మరల మీ డబ్బులు మీకు వస్తాయి.ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ,విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.