
BRS party
_ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండండి – బొరేగౌ నాగేందర్ పటేల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
భారీ వర్షాల కారణంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.రహదారులు నీటితో నిండిపోవచ్చని ముందస్తు హెచ్చరిక ఇవ్వుతూ, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొరేగౌ నాగేందర్ పటేల్ సూచించారు.సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని, ఉధృత ప్రవాహం ఉన్న చోట్లకు చేరరాదని సూచించారు.వాగులు, వంకల వద్దకు చేపల వేటకు జాలర్లు వెళ్లకూడదు. పశువులను కాయడానికి నదులు, వాగులు, చెరువుల దగ్గరకు తీసుకెళ్లకుండా జాగ్రత్త వహించాలని కోరారు.అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు.వర్షాల వల్ల ప్రమాదకరంగా మారే ప్రాంతాల్లో ఎలాంటి విపత్తులు జరుగకుండా మండల పోలీసులు మరియు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లి, వారి ప్రాణాలు రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.