
SI Rajesh
భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి
• ఎస్ఐ రాజేష్.
నిజాంపేట: నేటి ధాత్రి
రాబోయే రెండు, మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట స్థానిక ఎస్సై రాజేష్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట లో మాట్లాడుతూ.. గ్రామాల్లో చెరువులు కుంటల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లవద్దని, కరెంటు స్తంభాల వద్ద ఉండవద్దన్నారు. లోతట్టు ప్రాంతాలలో, పాడుబడిన ఇండ్లలో ఉన్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా అత్యవసర సమాచారం ఉన్నట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్, 100 నంబర్ నీ సంప్రదించాలన్నారు.