
“నేటిధాత్రి”,హైదరాబాద్.
జాగృతి అధ్యక్షురాలు కవిత ను కలిసి మద్దతు తెలిపిన బిసి కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్
ఈరోజు హైదరాబాదులో తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క ను కలిసిన బిసి కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మరియు ఇతర నాయకులు వారిని కలిసి మద్దతు ప్రకటించడం జరిగింది.
ఈ సందర్భంగా కవితక్క మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. బిసి ఉద్యమ బలోపేతం మరియు నలబై రెండు శాతం రిజర్వేషన్ పైన మరింత తీవ్రస్థాయిలో ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని బిసి రిజర్వేషన్ అమలు కోసం జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా భవిష్యత్తు లొ అనేక కార్యక్రమల రూపకల్పన జరుగుతుందని వారు అన్నారు.
రానున్న రోజులలో తెలంగాణ జాగృతి, మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ చేసే ప్రతి ఉద్యమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకు పోవాలని 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం బిసిలను, బిసి సంఘం నాయకులను మేధావులను, ఇతర ప్రజా సంఘాలను, కలుపుక విస్తృతమైన ప్రజా జాగరణ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటూ ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలని కవితక్క సూచన చేయడం జరిగింది.
ప్రతి ఉద్యమానికి కరీంనగర్ జిల్లా ఆయువు పట్టు అలాంటి కరీంనగర్ జిల్లాకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని వారు కోరడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులలో జాగృతి కార్యకర్తలు కానీ, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులకు నేను అండగా ఉంటానని వారు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ధైర్యంగా ముందుకు పోవాలని వారు అన్నారు.
బిసి ఉద్యమం బలోపేతం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కవితక్క భవిష్యత్త్ లో ఎలాంటి నిర్ణయం తీసుకున్న వారికి తమ సంపూర్ణ మద్దతు కవితక్కే ఉంటుందని గుంజపడుగు హరిప్రసాద్ వారికి తెలియచేయడం జరిగింది.