
కాంగ్రెస్ కు అండగా బీసీలు ఉండాలి
జిల్లా కాంగ్రెస్ నేత సాయిలి. ప్రభాకర్
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మక చారిత్రాత్మకమని ఇది సామాజిక విప్లవానికి నాంది అని జిల్లా కాంగ్రెస్ నాయకుడు బిసి నేత. సాయిలి ప్రభాకర్ పేర్కొన్నారు.అందుకు బీసీ కులాలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఆయన కోరారు.సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ కు బీసీలు అండగా నిలవాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన జనాభా ప్రతిపాదికన ఎవ్వరెంతో వారికంత రిజర్వేషన్ల డిమాండ్ ను దేశంలో తొలిసారిగా తెలంగాణలో అమలు చేయడం గర్వకారణమని అభివర్ణించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి కుదించగా అదే బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతానికి పెంచడం పట్ల రాష్ట్ర మంత్రి వర్గానికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ కు అండగా నిలబడి పార్టీని గెలిపించాలని ప్రభాకర్ కోరారు.