
BC Leaders Protest Election Delay Over Reservation Stay
ఎన్నికల వాయిదా ప్రక్రియపై బీసీల నిరసన
నర్సంపేట,నేటిధాత్రి:
ఈ నెలలో పెరగాల్సిన స్థానిక సంస్థలు ఎన్నికలు రెడ్డి జాగరణ ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ వేసిన నేపద్యంలో హైకోర్టు స్టే విధించడం పట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
నర్సంపేట డివిజన్ ప్రధాన కార్యదర్శి సామ్రాజ మల్లేశం అధ్యక్షతన నర్సంపేట పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు సోల్తి సారయ్య గౌడ్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్టే తేవడం అనేది అగ్రవర్ణాల కుట్రగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీలుగా ఏనాడు కూడా దానిని వ్యతిరేకించి స్టేలకు, కోర్టులకు వెళ్లలేదని తెలిపారు.మా ఓట్లు మీకు అవసరంకాబట్టే ఇలాంటి కుట్ర పన్నుతున్నారని తస్మాత్ జాగ్రత్త అని అగ్రవర్ణాలను సోల్తి సారయ్య హెచ్చరించారు.హై కోర్టు స్టే పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే బీ.సీ నేత ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు బందులో భాగస్వాములమవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నీలాలపూర్ నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోల్తి రవి,నర్సంపేట పట్టణ అధ్యక్షుడు గండు రవి,ఉపాధ్యక్షుడు చీర వెంకట్ నారాయణ,జిల్లా యువ నాయకులు బైరి నాగరాజు, సోల్తి అనిల్,సోల్తి పెద్ద సాంబయ్య,సోల్తి చిన్న సాంబయ్య
అఖిల్,అనీష్,రాజు,రమేష్,సంపత్ సతీష్ ,రాంబాబు, కే సాంబయ్య తదితరులు తెలిపారు.