BC Leaders Call for Unity Beyond Politics
రాజకీయాలకు అతీతంగా బీసీలు ఐక్యం కావాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గము (సంగారెడ్డి జిల్లా) మొగుడంపల్లి మండలంలో మండల బీసీ కుల సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ విషయం పై చేస్తున కుట్రల పై చర్చించారు. దీనికి సంబంధించి ఈ నెల 14 న తెలంగాణ రాష్ట్ర బంధుకు , పార్టీలకు అతీతంగా సంపూర్ణ మద్దతు తెలిపారు. బిసి లంగా ఐక్యం అయ్యి రాబోవు ఎన్నికల్లో కూడా అన్ని గ్రామాల్లో బిసి అభ్యర్థులనే గెలిపించుకోవాలి. ఈ కార్యక్రమంలో .పెద్దగొల్ల నారాయణ,కొండాపురం నర్సిములు, శంకర్ సాగర, నారాయణ బీసీ సంఘం ప్రతినిధి, వాడే శేఖర్, ఆర్.ఈశ్వర్, గొల్ల దశరత్ శ్రీకాంత్ ముదిరాజ్, మాదిరే వీరేశం, గోవింద్ గుండు, వాడే చెన్నూ,
బాయిని సుభాష్, నర్సింలు గుడిసె, శ్రీనివాస్ గొల్ల, సుభాష్ సతోలి, మంగలి రాములు, సిద్దు, నరసింహ గౌడ్, తదితరులు పాల్గొనారు
