BC JAC Committees Strengthened in Jahirabad
జహీరాబాద్ నియోజకవర్గ గ్రామ గ్రామన బిసి జె ఏ సి కమిటీలు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ము (సంగారెడ్డి జిల్లా)
జహీరాబాద్ నియోజకవర్గము బీసీ జేఏసీ కమిటీ సమావేశాలు ఘనంగా నిర్వహించినారు. ఈ మధ్యనే ఏర్పాటు అయిన బీసీ జె ఏ సి కమిటీ సభ్యులకు జె ఏ సి చైర్మన్ ,గౌరవ సభ్యులు సన్మానించారు.ఈ సమావేశంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల మరియు జహీరాబాద్ పట్టణ, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశాన్ని జేఏసీ నాయకులు అధ్యక్షత వహిస్తూ, బీసీ వర్గాల ఐక్యత, హక్కుల సాధన కోసం మరియు ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు.
నాయకులు మాట్లాడుతూ — “బీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో జేఏసీ కమిటీలను బలోపేతం చేయాలన్నారు. యువత రాజకీయంగా చైతన్యవంతులై, సమాజ పురోగతికి కృషి చేయాలి” అన్నారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు పాల్గొని బీసీ ఐక్యతకు తమ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు స్థానిక సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ తీర్మానం ఆమోదించారు.
నియోజకవర్గ ము లోని అన్ని మండలాలకు, జహీరాబాద్ పట్టణ కమిటీ లు ఏర్పాటుకు మండల ఇంచార్జి లను నియమించారు.జహీరాబాద్ పట్టణ ఇంచార్జి లుగా అరుణ్ కుమార్,సంతోష్,వేణు కడిగే, మహేష్ ముదిరాజ్,గంజి మహేష్. ఝారసంగం మండల ఇంచార్జి లుగా బి. వీరేశం,డా.పెద్దగొల్ల నారాయణ, వడ్డే శేఖర్ లుగా,
జహీరాబాద్ మండల ఇంచార్జి లుగా విశ్వనాథ్ యాదవ్,చాకలి మోహన్,దండి విట్ఠల్, కోహిర్ మండల ఇంచార్జి లుగా కొండాపురం నర్సిములు, ఖానాపూర్ రాచన్న, దుడేకుల ఇమ్రాన్,
మొగుడంపల్లి పల్లి అనురాధ గౌడ్, మఠం విశ్వనాథ్ స్వామి,పాండు, జగన్,విట్ఠల్.
న్యాలకల్ మండల ఇంఛార్జి లుగా రాజా నర్సింహ,శంకర్ సగర లుగా జహీరాబాద్ తాలూకా బీసీ జె ఏ సి కమిటీ నియమించింది. ఈ కార్యక్రమంలో డా.పెద్దగొల్ల నారాయణ, కొండాపురం నర్సిములు, అనురాధ గౌడ్,విశ్వనాథ్ యాదవ్,దుడేకుల ఇమ్రాన్,శంకర్ సగర,చాకలి మోహన్,నౌబాత్ జగన్,విశ్వనాథ్ స్వామి,మహేష్,అరుణ్ కుమార్,శేఖర్ వడ్డే, జగన్,రాజా నర్సింహ,దండి విట్ఠల్,విట్ఠల్,సంతోష్,వేణు,సాయి కుమార్,గంజి మహేష్,మహేష్ ముదిరాజ్,వీరేశం,తదితరులు పాల్గొన్నారు.
