బీసీ సమాజం సంబరాలు జరుపుకోవాలి
యావత్ బీసీలు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలి
ఈనెల లొనే శాసనసభలో బీసీ బిల్లు ఆమోదం
బీసీ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ బోయిని హన్మాండ్లు
జగిత్యాల మార్చి08 నేటి ధాత్రి .
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, విద్య ఉద్యోగాలలో కూడా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ బోయిని హన్మాండ్లు హర్షం వ్యక్తంచేస్తూ కృతజ్ఞతలు తెలిపారు పత్రికా ప్రకటన ద్వారా హన్మాండ్లు మాట్లాడుతూ గ్రామ గ్రామాన బీసీలు సంబరాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండాలని బీసీ సంఘలు యావత్ బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలని తెలిపారు. భారతదేశంలో కుల గణన జరిపి బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారు రిజర్వేషన్ల అమలుకు, న్యాయపరమైన చిక్కులు రాకుండా, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి సహకరించేలా దేశ జనాభా గణ నలో బీసీ కులాల గణన, చేపట్టడంతో పాటు, చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ప్రధాని మోడీని ఒప్పించాలని కోరారు. నిత్యం బీసీ జపం చేసే ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా బిసి రిజర్వేషన్ల పెంపుకు సహకరించాలని లేనియెడల వచ్చే ఎన్నికలలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన తెలిపారు.