
BC castes
బీసీ రిజర్వేషండ్ల చట్ట బద్ధత కల్పించాలి
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసి కుల గణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లు చట్ట బద్ధత కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నాయకుడు బొమ్మెర రాంబాబు డిమాండ్ చేశారు.బీసి కులాల రిజర్వేషన్ విషయం కేవలం వారి ఎన్నికల నినాదమె తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బీ సి కులాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అన్నారు. రాజ్యాంగంలో బీసి కులాల అభ్యున్నతి కోసమే డా అంబేద్కర్ 340 అధికరణ పొందపరిసితె రాజ్యాంగం అమలులోకి వచ్చి 90 సంవత్సరాలు కావస్తున్నా ఎందుకు ఈ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేయడం ఏమిటని ప్రశ్నించారు.బహుజన సమాజ్ పార్టీ వ్వవస్థపాకులు గౌ మాన్య శ్రీ కాన్షిరాం 1992 సంవత్సర కాలంలో అప్పటి ప్రధాని విపి సింగ్ హయం లో బీసి కుల గణన చెయ్యాలని పార్లమెంట్ సమావేశాల్లో వత్తిడి చేస్తే ఆనాడు బీసి కులాల జాబితా రిపోర్ట్ చేయ్యలని అప్పటి ఉప ప్రధాని దేవీలాల్ ని కమిషన్ గా నియమించిది.ఆ తర్వాత ఏర్పడిన బీజేపీ పార్టీ బీ సి కులాల జాబితాను పట్టించుకోకుండా వ్వవహరించిదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈదేశంలో బీ సి కులాల అభ్యున్నతి కోసం పని చేసే ఏకైక పార్టీ ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ అనే విషయాన్నిబీసీ,ఎస్సి, ఎస్టీ)క్రైస్తవ, ముస్లిం సోదరులు. సంబండ కులాలు జోతీరావుపూలే అంబేద్కర్.మాన్యశ్రీ కాన్షిరాం పని విదానం మరియు బావి బారత ప్రధాన మంత్రి కుమారి మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ లో పని చేసి రాజ్యాధికారం సాదించిన నాడే (బీసీ/ఎస్సి/ఎస్టీ) ప్రజల సమస్యలను పరిష్కరించబడతయని అన్నారు.