
రఘునాథపల్లి. (జనగామ)నేటి ధాత్రి:-
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పద్మశాలి జిల్లా నాయకుడు చింతకింది కృష్ణమూర్తి నేతను జనగామ జిల్లా బీసీ రాజ్యాధికార సమితి ప్రచార కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ నేత దాసు సురేష్ నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ… బీసీలకు రాజ్యాధికారం దిశగా పనిచేస్తానని జిల్లా వ్యాప్తంగా మండల కమిటీలను ఏర్పాటు చేస్తూ పార్టీని మరింత బలపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. తరతరాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారిన కూడా బీసీలను పట్టించుకోవడం లేదని. బిసిల పట్ల వివక్షత చూపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన నియమానికి సహకరించిన తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ నేత దాసు సురేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.