BC JAC Protest at ChandanaGhar
చందానగర్ లో బిసి జేఏసీ ఆందోళన
రిజర్వేషన్ల వ్యతిరేకులకు సద్బుద్ధి ప్రసాదించాలని అంబేద్కర్ కు వినతి
‘బంద్ ఫర్ జస్టిస్’ ను విజయవంతం చేయాలని సబ్బండ వర్గాలకు బిసి జేఏసీ పిలుపు
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-
తెలంగాణలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిసి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శేరిలింగంపల్లి బిసి జెఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం చందానగర్ లోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బిసి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా బిసి రిజర్వేషన్లను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్న వ్యతిరేక శక్తులకు సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతిపత్రాన్ని జేఏసీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాజీ కో చైర్మన్, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, తెలంగాణ బిసి కుల సంఘాల జేఏసీ కన్వీనర్, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, జేఏసీ నాయకులు తుడి ప్రవీణ్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, బిసి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ లు మాట్లాడుతూ దేశంలో స్వతంత్రం వచ్చిన నాటినుంచి నేటి వరకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేవలం బిసి లకు మాత్రమే లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

బిసి లకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తరువాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 18 వ తేదీన బంద్ ఫర్ జస్టిస్ పేరుతో తలపెట్టిన తెలంగాణ బంద్ ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కె సాయన్న ముదిరాజ్, బీసీ జేఏసీ నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్, సగర సంఘం రాష్ట్ర సలహాదారులు కెపి రామ్ సగర, సగర సంఘం గ్రేటర్ అధ్యక్షుడు మోడల రవి సగర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుక శ్రీనివాస్ సగర, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గంగాధర్ సగర, జేఏసీ నాయకులు జిల్ల గణేష్, సీతారాం సగర, రామకృష్ణ సగర, అశోక్ యాదవ్, నరసింహ, శంకర్ ముదిరాజ్, బాలరాజు సగర, నారాయణ రావు, శివశంకర్, ఆంజనేయులు సగర, చింతకింది రవీందర్ గౌడ్, కుమార్ యాదవ్, చెన్నం రాజు ముదిరాజ్, చందు సగర, శివ సగర, రాము, తిరుమలేష్, అడ్వకేట్ రమేష్, అంజమ్మ, మాధవి, బిక్షపతి, వెంకట నర్సింహా రావు, రమేష్ గౌడ్, రాజు ముదిరాజ్, మధుకుమార్, పెద్ద సంఖ్యలో బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు,
