తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బీసీ జేఏసీ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మండలంలో బిసి జేఏసీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
పైడిపెళ్లి రమేష్ బిసి జేఏసీ జిల్లా ఛైర్మెన్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ
42% బీసీ రిజర్వేషన్
రాష్ట్రంలోని పిల్ నెంబర్ 3 4 ద్వారా మార్చి 2020లో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతూ ఆమోదించింది ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపబడి గత ఏడు నెలలుగా కేంద్రం వద్ద తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడానికి పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచి తొమ్మిదవ షెడ్యూల్లో అమలు చేయించే బాధ్యతను తనపై వేసుకొని ఆ దిశగా చర్యలు చేపట్టాలి ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మనవి చేస్తున్నాం
రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
42% రిజర్వేషన్ లో ఉపవారికరణ సబ్ క్యాటగిరేషన్ చేయాలి అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలి
కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించిన మొదటి సంవత్సరంలో కేటాయించిన 9200 కోట్లలో కేవలం 2068 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు ఈ సంవత్సరం కూడా ఖర్చులు అలాగే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బీసీల విద్య ఉపాధి ఆర్థిక అభివృద్ధి కోసం మొత్తం 40 వేల కోట్లు తక్షణమే అనగా ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఖర్చు చేయాలి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చేసిన అన్ని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో అన్ని నామినేటెడ్ పోస్టులు కమిషన్లు బోర్డులు సలహా మండల్లో 90 శాతం ప్రాతినిథ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇది సామాజిక న్యాయం సమాన అవకాశాలు తగు ప్రాతినిధ్యం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
