ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసిన బిసి జేఏసీ నాయకులు
మంచిర్యాల,నేటి ధాత్రి:
బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ ఆధ్వర్యంలో బీసీల బాంధవుడు,బీసీల ఆశాజ్యోతి ఎమ్మెల్సీతీన్మార్ మల్లన్న ని హైదరాబాదులో తన ఆఫీసులో శనివారం కలిసి బీసీ ఉద్యమానికి,వెన్నుదన్నుగా నిలుస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ని ఘనంగా సన్మానించడం జరిగింది.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ప్రజల వరకు ఏ విధంగా తీసుకువెళ్లాలో మల్లన్న తో చర్చించడం జరిగింది.బీసీ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. అలాగే మంచిరాల జిల్లావ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు తీసుకొని పోవడం కోసము చర్చించారు.అదేవిధంగా బీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడైన వట్టా జానయ్య యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొని మంచిర్యాల బీసీ జేఏసీ కి పలు సూచనలను,సలహాలను అందించడం జరిగింది.ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా బీసీ జేఏసీ నాయకులు ఆవిడపు గణేష్,వేముల మల్లేష్,గుడిమల్ల వెంకటేశ్వర్లు,పిట్టల రవీందర్,ఎండి లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.